దేవరాపల్లి, అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్,28.భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం వారి ఆధ్వర్యం లో అక్టోబర్ 2 నుంచి 7 వరకు కాశ్మీరీ యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్ నిర్వహించటం జరుగుతుంది. ఈ యువ సమ్మేళనానికి సంబందించిన గోడపత్రికను తారువలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆవిష్కరించారు.ఆంధ్ర ప్రదేశ్ యొక్క సంస్కృతి సంప్రదాయాలు కాశ్మీరీ యువత కి తెలియజేయటం వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు మనం తెలుసుకోవటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని, జిల్లా యువ అధికారి జి.మహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర, మండల జెడ్పీటీసీ కర్రీ సత్యం, పలువురు నాయకులు, జిల్లా యువ అధికారి జి.మహేశ్వరరావు, ఎన్.ఎస్.ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్.లీలా ప్రసాద్ రెడ్డి, జాతీయ యువ వాలంటర్ గుంపాన గణేష్ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!