in ,

ఎన్ఆర్ఇజిఎస్ వేతన దారులకు పని కల్పించండి

పాడేరు, సెప్టెంబర్ 26:- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద తొలగించిన జాబ్ కార్డులను పునః పరిశీలించి తొలగింపుకు కారణాలతో సహా పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపిడిఓ లను ఆదేశించారు. అదేవిధంగా వేతనదారులకు  పని కల్పించాలని ఆదేశించారు.  మంగళవారం కలక్టరేట్ నుండి నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత మూడు సమావేశాల నుండి చెప్తున్నప్పటికీ సరిగా స్పందించక పోవటం పట్ల ఎన్ఆర్ఇజిఎస్ లో పని చేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది పని తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్త పరిచారు. అక్టోబర్ పదవ తేదీలోగా నివేదికలు అందించాలని, పని తీరు మెరుగు పడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త పనులకు అంచనాలు తయారు చేసి ప్రతిపాదిస్తే పనులు మంజూరు చేస్తామని చెప్పారు.

పాటశాల విద్యార్ధుల డ్రాప్ అవుట్స్ వివరాలు సమర్పించాలని మండల విధ్యా శాఖాదికారులను  కలక్టర్ ఆదేశించారు. పదవ తరగతి ఫెయిల్ ఐన విద్యార్ధులను తప్పనిసరిగా పాటశాలలో తిరిగి ప్రవేశ పెట్టాలని లేదా ఓపెన్ స్కూల్ లో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. అదే విధంగా ఏయే తరగతుల విద్యార్ధులు ఎంతమంది బడి బయట ఉన్నదీ వివరాలు నివేదిక రూపoలో అందజేయాలన్నారు.  భవనాలు లేని పాటశాలలు, విద్యా వాలంటీర్ల అవసరం  గుర్తించి వివరాలు అందజేయాలని ఎంపిడిఓ లను ఆదేశించారు.  అదేవిధంగా డిజిటల్ తరగతుల ఎక్విప్మెంట్ వెంటనే ఇన్స్టాల్ చేయాలని ఆదేశించారు.

లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆమోదించిన జాబితాను ఆయా మండలాలకు పంపించినప్పటికీ సంబంధిత పంచాయతి కార్యదర్శులు బర్త్ సర్టిఫికేట్లను జారీ చేయటంలో తాత్సారం వహించటo పట్ల ఆగ్రహం వ్యక్త పరిచిన కలెక్టర్ సంబంధిత కార్యదర్శి సంతకం చేసినట్లు ఎంపిడిఓలు  ద్రువీకరించి సర్టిఫికెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు.  పంచాయతి కార్యదర్శులను రేషనలైజ్ చేయాల్సిందిగా డిపిఒను ఆదేశించారు.  వారి హాజరును పర్యవేక్షించాలని డిఎల్డిఓ శాంతకుమారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఎల్డిఓ శాంతకుమారిన, డిబిటి మేనేజర్ నరేష్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా మేనేజర్ సునీల్, మండలాల నుండి, మండల అభివృద్ధి అధికారులు, ఎం.ఇఓలు, ఎపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

గిరి పిల్లల భవిష్యత్తుపై ప్రత్యెక దృష్టి పెట్టండి

ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి