in , ,

వచ్చే ఎన్నికల్లో జగన్ కు 4 సీట్లే…

మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాన్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఆయన ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ ప్రజ్వాస్వామ్యానికే ప్రమాదకరమని.. బాబు అక్రమ అరెస్ట్‌ను మేధావులు ఖండించాలని కోరారు. చంద్రబాబు చనిపోతే తనకు ఎదురుండదని సీఎం జగన్ భావిస్తున్నారని అన్నారు. ఎవరిని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే సీఎం జగన్ ఆలోచన అని తీవ్ర ఆరోపణలు చేశారు.సీఎంగా ఎవరూ ఎళ్లకాలం ఉండరనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని సూచించారు. నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 151 కాదు.. జగన్‌కు 4 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. త్వరలోనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి మాట్లాడుతానని తెలిపారు. సీఎం జగన్‌కు ఖచ్చితంగా నారా భువనేశ్వరి ఉసురు తగులుతుందని విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర

విరిగిపడిన కొండచరియలు: రైళ్లు నిలిపివేత