in , ,

ఆ డబ్బులు ఏమయ్యాయి?”

గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన వారికి నేటికీ పారితోషికం అందలేదు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించిన వలంటీర్లు, ఇతర సిబ్బందిపై కనికరం చూపడం లేదు.

ఆందోళనలో వలంటీర్లు, 

ఆ డబ్బులు ఏమయ్యాయి?

గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన వారికి నేటికీ పారితోషికం అందలేదు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించిన వలంటీర్లు, ఇతర సిబ్బందిపై కనికరం చూపడం లేదు.

ఏడాదైనా ఇంకా చెల్లించని 

ఆందోళనలో వలంటీర్లు, సిబ్బంది

అధికారుల నిర్వాహకంపై ఆగ్రహం

(గరుగుబిల్లి)

గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన వారికి నేటికీ పారితోషికం అందలేదు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించిన వలంటీర్లు, ఇతర సిబ్బందిపై కనికరం చూపడం లేదు. సుమారు ఏడాది కాలంగా సంబంధిత అధికారుల చుట్టూ వారు కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యం. దీనిపై స్పందించే వారే కరువయ్యారు. నిబంధనల మేరకు విధులు నిర్వర్తించిన తమకు తక్షణమే చెల్లింపులు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

గతేడాది జిల్లాలో మొత్తంగా 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 188 ఆర్‌బీకేల్లో , 41 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో, 14 ఎఫ్‌పీవోల్లో, 12 గిరి వెలుగు సంఘాల్లో, ఏడు జీసీసీల్లో, నాలుగింటిని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా ధాన్యం నాణ్యతను పరిశీలించేందుకు సాంకేతిక సహాయకుడు, సమాచారాన్ని పొందుపర్చేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను విధుల్లోకి తీసుకున్నారు. రైతులకు సహకరించేందుకు విద్యావంతులైన ఇద్దరు వలంటీర్లను నియమించారు. వీరికి నెలకు రూ. 1500 అదనంగా చెల్లిస్తామని ప్రకటించారు. సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రోజుకు రూ. 500 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. మొత్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన 532 మంది వలంటీర్లు (రూట్‌), మరో 532 మంది సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పైసా కూడా అందలేదు. ఏడాదిగా వారికి ఎదురు చూపులే మిగిలాయి. తాము పడ్డ కష్టాన్ని గుర్తించి.. తక్షణమే చెల్లింపులు చేయాలని వలంటీర్లతో పాటు ఆయా సిబ్బంది కోరుతున్నారు.

వాస్తవంగా ఆయా సిబ్బంది నియామకం, చెల్లింపుల బాధ్యతను సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అప్పగించారు. ఈ మేరకు గతేడాది వారికి ప్రతి క్వింటాకు రూ. 32 చొప్పున పౌర సరఫరాల సంస్థ చెల్లించింది. ఈ మొత్తంలో నుంచే సహాయకులు, వలంటీర్లకు పారితోషికం అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వలంటీర్లతో పాటు ఆయా సిబ్బందికి కమీషన్‌ చెల్లించలేదు. దీనిపై వారు ప్రశ్నిస్తున్నా.. ఎవరూ స్పందించడం లేదు. సంబంధిత అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. దీంతో ఆయా సిబ్బంది తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతులకు సంబంధించి రవాణా చార్జీలు, గోనెలు, హమాలీ చార్జీలను పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాలకు జమ చేసింది. కాగా ఈ ఏడాది కొనుగోలుకు అవసరమైన సన్నాహాలు చేస్తుంది. అయితే ఇప్పటికీ కమీషన్‌ చెల్లించకపోవడం తగదని సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వలంటీర్లు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

స్పందన లేదు..

కొనుగోలు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలందించాం. అధికారులు గుర్తించడం లేదు. నేటికీ ఎటువంటి స్పందన లేదు. కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా కనికరం చూపలేదు. ఉన్నతాధికారులు స్పందించి మాకు రావల్సిన మొత్తం చెల్లించాలి.

– భార్గవి, టెక్నికల్‌ అసిస్టెంట్‌, గొట్టివలస

====================

పైసా కూడా చెల్లించలేదు

కొనుగోలు కేంద్రాల్లో సేవలందిస్తే నెలకు రూ.1500 చెల్తిస్తామని చెప్పారు. నిర్వహణ సమయంలో పూర్తిస్థాయిలో సేవలందించాం. అయితే ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదు. దీనిపై ప్రశ్నించినా స్పందన లేదు. రైతుల వద్దే తీసుకోవాలని సహకార సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా పనిచేసిన కాలానికి మొత్తం చెల్లించాలి.

– జనార్దనరావు, వలంటీర్‌, గరుగుబిల్లి మండలం

=============================

ఆ సంస్థలే చెల్లించాలి

ధాన్యం కొనుగోలుకు సంబంధించి వలంటీర్లను నియమించిన సంస్థలే చెల్లించాల్సి ఉంది. పౌర సరఫరాల సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన సంస్థకు క్వింటాకు రూ.32 చొప్పున చెల్లించాం. ఈ మొత్తంలోనే ఖర్చులు భరించాలి. కొనుగోలుకు సంబంధించి నివేదికలు రావల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి పౌర సరఫరాల సంస్థే సహాయక సిబ్బందిని నియమిస్తుంది. వేతనాలు కూడా సంస్థ చెల్లిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం.

– అరుణ్‌కుమార్‌, ఏవో, పౌర సరఫరాల సంస్థ అకౌంట్స్‌ విభాగం, పార్వతీపురం మన్యం

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

జెడ్పిటిసి నూకరాజు కి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పరామర్శ

అర్జీలను పక్కాగా పరిశీలించండి”