in ,

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి

  • సూర్యాపేట తసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు. 

  • అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి.

  •  సూర్యాపేట టౌన్  : 

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, గృహలక్ష్మి,డబల్ బెడ్ రూమ్ పథకాలను బిఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికారం పార్టీ నేతలు తప్పుడు ఆలోచనను మానుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, మేకన బోయిన శేఖర్ లు అన్నారు. గురువారం సిపిఎం పార్టీ వన్ టౌన్, త్రీ టౌన్, సూర్యాపేట రూరల్ కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట తాసిల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలందరికీ దళిత బంధు, బీసీ రుణాలు, గృహలక్ష్మిఇండ్లు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లుఇవ్వాలనిఅధికార పార్టీ కార్యకర్తలకే ఇవ్వకూడదనిడిమాండ్ చేస్తూధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ  పథకాలు మొత్తం బిఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింపజేసే విధానాన్ని మార్చుకొని  అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే వారిని, కానీ నేడుబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ లో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.నీజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం లేదన్నారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, అందరిని కలుపుకొని  ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నితాసిల్దార్ కు సమర్పించారు.ఈ కార్యక్రమంలోసిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు మేకన బోయిన సైదమ్మ, నాయకులు వల్లపు దాసు సాయికుమార్, చెరుకు సత్యం,సురేష్, వెంకన్న, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులను ఎక్కువగా ప్రోత్సహించాలి

పోషకా ఆహారంతోనే రక్తహీనత రాకుండా ఉంటుంది – సూపర్వైజర్ బ్లాండిన