ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులను ఎక్కువగా ప్రోత్సహించాలి..
ఈ సంవత్సరం పదివేల ఐదు వందల ఎకరాల సాగు లక్ష్యం.
రైతులకు పంట సాగులో మెళకువలు అందించాలి.
యువ రైతులను ప్రోత్సహించాలి:
–జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్
జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం మునగాల మండలంలోని మాదారం, గణపవరం అలాగే మునగాలలో సంబంధిత శాఖాధికారులతో కలసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యాన అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఆయిల్ ఫామ్ పంట సాగు విధానం, ప్రభుత్వ సబ్సిడీ, అంతర పంటల సాగు అంశాలపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరం పదివేల ఐదువందల ఎకరాల లలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2100 ఎకరాలలో రైతులు ముందుకొచ్చారని అలాగే 1100 పైగా మొక్కలు రైతులు నాటారని మిగిలిన రైతులకు కూడా ఈ నెలలో మొక్కలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మాదారం లో బండి రమేష్, ఇతరులు డ్రిఫ్ ద్వారాసాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించి సాగు విధానం తెలుసుకున్నారు. అలాగే గణపవరం లో కె. వెంకట రెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్ పంట సాగు పరిశీలించి ఎన్నో పోషకాలు ఉన్న పంట సాగు చేస్తున్న రైతులను అభినందించి మార్కెటింగ్, సబ్సిడీ విధివిధానాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు సరమంతమైన భూములు ఎన్నో ఉన్నాయని, ప్రభుత్వ సబ్సిడీ రైతులకు అందేలా చూడాలని ఎక్కువ రైతులను పంట మార్పిడి విధానం పై ప్రత్యేక తర్ఫీదు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మునగాలలో ఎం. వెంకట రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించి అంతర పంటల సాగుతిరును అడిగి తెలుసుకుని అభినందించారు. కోకా మొక్కలను ఎక్కువగా సాగులోకి తేవాలని వీటి కాయలు చెక్లెట్ తయారీలో ఎంతో ఉపయోగపడనున్నాయని అన్నారు. గణపవరం తోటలో గట్ల పై నాటిన కొబ్బరి చెట్లను పరిశీలించారు.అనంతరం మునగాల లో డ్రమ్ ఫిడర్ తో 5 ఎకరాలలో వరి సాగు చేసిన టి. రాఘవ రెడ్డి రైతు పంట పరిశీలించారు. తదుపరి స్థానిక కనక దుర్గా ఫెర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసి యూరియా నిల్వలను పరిశీలించి రైతులకు యూరియా వలన ఇబ్బందులు కలగకుండా పంపిణీ సాఫీగా జరగాలని ఈ..పాస్ ద్వారా రైతులకు అందించే అమ్మకాలను పరిశీలించారు. జిల్లాలో 3466 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని అన్నారు. రైతులకు ఎమ్మార్పీ ధరలకే యూరియా అందించాలని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన వన శాఖాధికారి శ్రీధర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఆర్. ఐ రాధ సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!