చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బాబు అరెస్టు అనేది మోదీ, జగన్, కేసీఆర్ చేసిన కుట్ర అని కాంగ్రెస్ నాయకులు , సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్, బాబు అరెస్టుపై వివిధ రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు, టీడీపీ నాయకులు మాత్రం ఇప్పటివరకూ బాబు అరెస్టు వెనుక కేంద్రం పాత్ర ఉందనే వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బాబు అరెస్డు, రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా తాము చంద్రబాబుతోనే అంటూ వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.