బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి రూ.55,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.140 పెరిగి రూ.60,220కి ఎగబాకింది. అటు కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.78,300 వద్ద కొనసాగుతోంది.