in , , , ,

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి..?

  • మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి..?

  • ప్రతిపాదిత చట్టంతో వచ్చే మార్పులు ఏంటి?

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు (విమెన్ రిజర్వేషన్ బిల్) ను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుకు ప్రధాని మోది నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉంది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. ప్రభుత్వంలో మహిళల సంఖ్యను పెంచడానికి, భారతదేశాన్ని మరింత సమాన దేశంగా మార్చడానికి ఇది ఒక కీలక ముందడుగు గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? ప్రతిపాదిత చట్టంతో ఏం మారుతుంది? చరిత్రలో ఈ బిల్లు ప్రస్తావన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లోకసభ, రాష్ట్రాల శాసనసభలోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఇలా రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో, మూడింట ఒక వంతు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అంటే ఒక రాష్ట్ర అసెంబ్లీలో 100 సీట్లు ఉంటే, 33 మహిళలకు రిజర్వ్ చేస్తే, ఆ 33లో 11 ఎస్సీ/ ఎస్టీ వర్గాల మహిళలకు రిజర్వాయి ఉంటాయి. మహిళలందరికీ సమానంగా ఎన్నికయ్యే అవకాశం ఉండేలా రిజర్వుడ్ స్థానాలను వేర్వేరు నియోజకవర్గాలకు కేటాయిస్తారు.

బిల్లు ఆమోదం పొందిన 15 ఏళ్ల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ ముగుస్తుందని బిల్లులో పేర్కొన్నారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళల రిజర్వేషన్ కోసం డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ లో కూడా దీనిపై చర్చ జరిగింది.

భారతదేశంలో మహిళా రిజర్వేషన్ డిమాండ్ వలస రాజ్యాల కాలం నాటిది. 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రావీన్షియల్ లెజిస్లేచర్లో పరిమిత రిజర్వేషన్లను మహిళలకు అందించింది. కొంతమంది భారతీయులను సంతోష పెట్టేందుకు బ్రిటన్ ఇలా చేసింది.

ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి ఆ కాలంలోని ప్రధానమైన సంఘాలు భారతీయ మహిళలకు ఓటు హక్కు కోసం మాత్రమే కోరడం స్టార్ట్ చేశాయి. అదే సమయంలో ఆ సంఘాలు ప్రభుత్వంలో మహిళలకు మాత్రమే కొన్ని సీట్లు ఉండాలని డిమాండ్ను డీల్ చేయాల్సి వచ్చింది. అయితే దీనిని ఆ సంఘాలు వ్యతిరేకించాయి కానీ 1935లో బ్రిటన్ మహిళలకు కొన్ని సీట్లు ఇచ్చింది.

రాజ్యాంగ సభ:

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా మహిళా రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చింది. అయితే, రిజర్వ్ సీట్ల అవసరం లేకుండా ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కొందరు సభ్యులు వాదించడంతో, రిజర్వేషన్ అనవసరంగా భావించారు. మహిళలకు ప్రత్యేక హక్కులు అవసరంలేదని, వారిని పురుషులతో సమానంగా చూడాలని రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు రేణుక రే వాదిస్తూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. మహిళలు తమ హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాడారని, ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన పాత్రలు పోషించినందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్లు సీట్ల ఆలోచనను భారతదేశంలోని మహిళా సంస్థలు కూడా తిరస్కరించాయి. ప్రముఖ నాయకురాలు సరోజినీ నాయుడు మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని తాను అనుకోవట్లేదన్నారు. మహిళలు దృఢమైన వారని, సమర్థులని, పురుషుల నుంచి రక్షణ పొందాల్సిన అవసరం లేదని ఆమె అప్పట్లో మాట్లాడారు. రాజకీయాలలో, యుద్ధంలో మహిళలు ఎల్లప్పుడూ పాల్గొంటారని, స్త్రీలు పురుషులతో సమానమని, వారికి రిజర్వేషన్ల అవసరం లేదని ఆమె వాదించారు.

  • నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్

మార్గరెట్ అల్వా నేతృత్వంలోని కమిటీ 1988లో మహిళల హక్కుల కోసం ఒక నివేదికను రూపొందించింది. ఇందులో అందరికీ ఒకే చట్టం, మహిళల ఆస్తులు, సీట్లు, లింగనిర్దారణ  పరీక్షలు, వరకట్న వేధింపులు వంటి 353 సూచనలు ఉన్నాయి.

  • 73వ, 74 వ సవరణ చట్టాలు:

భారత రాజ్యాంగంలోని 73వ,74వ సవరణ చట్టాలు గ్రామ సభలు (పంచాయతీ రాజ్ సంస్థలు), పట్టణ స్థానిక సంస్థల్లో (మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు వంటివి) మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించాయి. అంటే ఈ సంస్థలలో ఎన్నుకునే సభ్యులలో కనీసం మూడింట ఒకవంతు మంది మహిళలు ఉండాలి.

  •  బిల్లు చరిత్ర

మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా 1996లో లోక్‌సభలో ప్రవేశపెట్టగా, 2010లో రాజ్యసభ ఆమోదించింది, కానీ అది చట్టంగా మారలేదు. ఈ బిల్లును ఆమోదిస్తామని 2014, 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోల్లో బీజేపీ హామీ ఇచ్చింది.

[zombify_post]

Report

What do you think?

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యమే ధ్యేయంగా వై.యస్.ఆర్.సంపూర్ణ పోషణ పథకం

రేపు ముంచంగిపుట్టు లో స్పంద‌న‌ జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ వెల్ల‌డి