వినాయక మండపాలను సందర్శించిన ఎస్సై టీ. సత్యనారాయణ,
ధర్మారం.సెప్టెంబర్ 18 గురు న్యూస్ : పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో వినాయక చవితి సందర్భంగా ఎస్సై టీ సత్యనారాయణ, గణపతి మండపాలను సందర్శించి, భక్తులకు పలు సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మరియు విద్యుత్ కలెక్షన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వినాయక మండపాలలో జూదం పేకాట మద్యం సేవించడం లాంటివి చేయకూడదని, అలాగే ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా మండపాల వద్ద వాహనాల పార్కింగ్ చేయరాదని అన్నారు. ఎల్లప్పుడూ మండపంలో కనీసం ఇద్దరూ వ్యక్తులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు ప్రజలందరు శాంతియుత వాతావరణం లో గణేష్ ని పండగ నవరాత్రి ఉత్సవాలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
[zombify_post]