18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు
ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం
నిర్మల్ రూరల్ : ఎలక్షన్ సెకండ్ సమ్మరీ రివిజన్లో భాగంగా
సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎలక్షన్ రోల్ అబ్జర్వర్
అహ్మద్ నదీమ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్
రెడ్డి, మంచిర్యాల జిల్లా కలెక్టర్
సంతోష్, నిర్మల్ రెవెన్యూ అదనపు కలెక్టర్లు కిశోర్ కుమార్, మంచిర్యాల
లోకల్ బాడీ రాహుల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సమా
వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్
నదీమ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు కొత్త ఓటరు
నమోదు కొరకు ఇంకా మూడు రోజులే సమయం ఉన్నందున ఈ ఆర్వోలు
దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధంచేసుకుని ముందుకు సాగాలన్నారు.
దాని కొరకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా సోషల్ మీడియాల ద్వారా
ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలన్నారు. గడువు సమీపిస్తు
న్నందున చివరి సమీపంలో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చి ఇబ్బంది
ఏర్పడకుండా ఇప్పటి నుంచే మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్య
టించి బిఎల్వోల ద్వారా క్షేత్రస్థాయిలో పని సక్రమంగా జరిగేటట్టు చూడా
సమస్యలు పరిష్కరించకపోతే
సంవత్సరాలు నిండిన ప్రతీ MALI STRICT.
ఒక్కరూ ఓటరు జాబితాలో
నమోదు చేసుకునేలా చర్యలు
చేపట్టాలన్నారు. పెళ్ళిళ్లు అయి
చిరునామా మారిన వారిని గుర్తించి వారికి కూడా కొత్త చిరునామాల్లో ఓటు
హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరుణ్
రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కుపై చైతన్యం కలిగించేలా పలు కార్యక్రమాలు
చేపడుతున్నామని, దానిలో భాగంగానే గత నెలలో ఓటు హక్కు ప్రాముఖ్యత
గురించి 5కే రన్ నిర్వహించడం జరిగిందని, నాలుగు రోజులపాటు స్పెషల్
క్యాంపెయిన్ డేస్ నిర్వహించామని, అంతేకాకుండా చునావ్ గ్రామసభలో
భాగంగా వివిధ గ్రామాలలో పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం
జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు అడిగిన
ప్రశ్నలకు సందేహాలకు మంచిర్యాల కలెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్లు సమాధా
నంతో నివృత్తి చేశారు. కార్యక్రమంలో నిర్మల్, మంచిర్యాల, ఆర్డీవోలు,
తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]