సత్తివాడ ఎంపీపీ స్కూల్ ను తనిఖీ చేసిన ఎంఈఓ
తెర్లాం మండలం సత్తివాడ ఎంపీపీ స్కూల్ ను బుధవారం మండల విద్యాశాఖ అధికారి జె త్రినాధ రావు తనిఖీ చేశారు. స్కూల్ అసెంబ్లీని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థుల హాజరు, తరగతి సామర్థ్యాలను తనిఖీ చేశారు. విద్యార్థుల వర్క్ పుస్తకాలు దిద్దుబాటులోను, పూర్తయిన సిలబస్, ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్స్, టిఏఆర్ఎల్ అమలు, మరియు మరుగుదొడ్లు పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలు మొదలగు అంశాలను తనిఖీ చేశారు.
[zombify_post]