ఈ నెల 15 వరకు వర్షాలు కొనసాగుతాయంటున్నారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. అలాగే అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, కాకినాడ, కృష్ణా, విజయనగరం భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మిగిలిన జిల్లాల్లా మాత్రం తేలికపాటి నుంచి మోస్తురు వానలు పడే ఛాన్స్ ఉంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 68.8, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 65.8, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 54, ఏలూరు జిల్లా వేలూరుపాడులో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 39.4, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 33.4, అనకాపల్లిలో 33, విశాఖపట్నంలో 30.2, శ్రీకాకుళం జిల్లా పలాసలో 21.4, ప్రకాశం జిల్లాముండ్లమూరులో 21.4, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 20.8, విజయనగరం జిల్లా పూసపాటి రేగలో 20.4, పార్వతీపురంలో 20.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మన్యంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ముంచంగిపుట్టులో అత్యధికంగా 63.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులు కోతకు గురికాగా.. ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. చింతపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జి.మాడుగుల మండలంలోని బొయితిలిలో నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. పాడేరులో కూడా ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగింది. మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది.. సమారు రెండు గంటల పాటూ కొనసాగింది.
దీంతో పాడేరులోని రోడ్లన్నీ జలమయం కాగా.. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ముంచంగిపుట్టు పరిధిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. చింతపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపివ్వకుండా కుండపోత వర్షం కురిసింది. వర్షం వల్ల ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. వర్షం వల్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో మంగళవారం 5 గంటల పాటు ఏకధాటిగా కుండపోత వాన పడింది. సీలేరు, ధారకొండల్లో ప్రధాన రహదారులపై వర్షపునీరు ప్రవహించింది. జి మాడుగుల మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. పెదబయలు మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అరకు లోయ మండలంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భారీగా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. హుకుంపేట మండలంలో ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమైన వర్షం సాయంత్రం 5 గంటల వరకు భారీగా కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పంటపొలాల్లో నీరు భారీగా చేరింది.
[zombify_post]