కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ కళాకారుడు బండరాయిలకు కూడా ప్రాణం పోస్తున్నాడు ఓ చిన్న పెయింటర్ హనుమంతు.. ను ఏదైనా కొండకు చిత్రం గీశాడు అంటే ఆ జీవి నిజంగానే ఉందా అన్న రీతిలో ఈ పెయింటర్ తన సృజనాత్మకతను జోడించి తన అద్భుతమైన పెయింటింగ్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.. ఆదోని శ్రీ రామ జల తీరాన వెలసిన అతి పురాతన దైవం జల శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ నృసింహ స్వామి సన్నిధి లో ఆర్టిస్ట్ అనుమంతు పులి ముఖాన్ని దేవాలయం అనుకొని ఉన్న ఓ బండరాయికి గీశాడు. అదేవిధంగా శ్రీ రణమండల ఆంజనేయస్వామి కొండ ఎల్లమ్మ కొండకు వెళ్ళు రహదారిలో ఉన్న ఓ కొండకు హనుమంతుడి ముఖచిత్రం వలె పెయింటింగ్ వేయడంతో ఈ కళాకారులు ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు .అంతలా ఆర్టిస్ట్ హనుమంతు వేసే బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి…
[zombify_post]