కన్నుల పండువగా సీతారామకళ్యాణం
ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీమద్రామాయణ ప్రాంగణం విజయనగరం శ్రీరామనారాయణంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం దేవాలయం అర్చకులు చాణక్య, శ్రీ హర్ష ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సీతారాములకు స్నపనము, పంచామృతాభిషేకాలు గావించారు. అనంతరం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. ఈ ఉత్సవంలో ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]