ఈ రోజు వడ్డేపల్లిలో నిర్వహించినటువంటి సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ పోచమ్మల పండుగకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రోడ్డు వెడల్పు,డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వాటిని పరిశీలించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. వడ్డే పల్లి తో పాటు పక్కన ఉన్నటువంటి కాలనీలు ఈ పండుగలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు.అధికారికంగా జరిగే పండుగ కాబట్టి పెద్ద సంఖ్యలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం
రధంతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్,మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, ఏ సి పి భోజ రాజు, ట్రాఫిక్ సి ఐ సుజాత తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
[zombify_post]