- మందస మండలం బుడార్సింగి పంచాయితీ పద్మాపురం గ్రామంలో గుర్తుతెలియని జంతువు దాడిలో 10 మేకపిల్లలు మృత్యువాత పడిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తం దొలాయి మేక పిల్లలను మేపుతుండగా గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. ఈ సంఘటనలో 10 మేకపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గ్రామంలో అలజడి నెలకొంది. మేక పిల్లలు మృతి చెందడంతో మేకల యజమాని పురుషోత్తం బోరున విలిపిస్తున్నాడు.
[zombify_post]