in , ,

బాబు పాపాలు బయట పడుతున్నాయి

రాష్ట్రానికి పట్టిన చీడపురుగు చంద్రబాబు:

  • బాబు పాపాలు బయట పడుతున్నాయి
  • ఐటి శాఖ ఇచ్చిన నోటీసులు పై రామోజీ,రాధాక్రిష్ణ వార్తలు వేయరా.!
  • ఘాటుగా విమర్శించిన రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు

రాష్ట్రానికి పట్టిన చీడపురుగు ప్రతిపక్ష టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. శనివారం కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. టీడీపీ అధినేతకు ఆదాయపుపన్ను శాఖ నోటీసుల నేపథ్యం గుర్తు చేశారు.చంద్రబాబు దగ్గర దొరికింది చాలా తక్కువ అన్నారు. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇసుక ఇలా అన్నింటా దోచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.మేనేజ్ చేయడంలో నిపుణుడు కాబట్టి అవినీతికి పాల్పడిన తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దోపిడీకి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు కేవలం శాంపిల్ అన్నారు.టిడ్కో ఇళ్ల పేరుతో పేదల నుండి ఒక్కొక్కరి దగ్గరి నుండి రూ.3 లక్షలు దోచుకున్నాడన్నారు. డబ్బులు రాని ఆరోగ్యశ్రీ, 108 వంటి వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలియడం వల్లే నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్లబేరానికి వెల్లారని విమర్శించారు.ప్రజలు చంద్రబాబు కుయుక్తులు,కుట్ర రాజకీయాలు గమనించాలని కోరారు. చంద్రబాబు అవినీతి త్వరలో బయట పడనుందని,బాబు పాలనలో తన సొంత సామాజిక వర్గానికి అక్రమంగా దోచిపెట్టిన నీచరాజకీయ నాయకుడని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా ధనాన్ని ఒకే వర్గానికి అందజేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన పెద్ద దొంగ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Report

What do you think?

Newbie

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

gudivada

కాళ్ళు మొక్కడానికే ఢిల్లీ

బీఆర్ఎస్ శిబిరంలో అలజడి