సూర్యాపేట రూరల్: మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం గ్రామశాఖ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తడకళ్ళ శ్రీరంగం,కందుల కుశలవరెడ్డి లు కేక్ కటింగ్ చేశారు.అనంతరం గ్రామశాఖ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో యూత్ సలహాదారులు నర్ర పరమేష్, అధ్యక్షులు సాంబారు చంద్రశేఖర్ లు మాట్లాడుతూ..
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సంగతి అటుంచి బతుకుదెరువు కరువై ఆగమైన పల్లెలకు స్వరాష్ట్రంతో కేసీఆర్ జీవం పోశారన్నారు.
ఆ కులం, ఈ కులం అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారికి సరికొత్త పథకాల ద్వారా బతుకు భరోసానిచ్చారని తెలిపారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ గ్రామాల్లో కష్టాలను కళ్లారా చూసి.. వాటిని కడతేర్చేందుకు ప్రాణాలు పణంగా పెట్టి.. అలుపెరుగని పోరు చేసి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షైన స్వరాష్ర్టాన్ని సాధించారని అన్నారు.
తొమ్మిదేళ్ళ పాలనలో బంగారు తెలంగాణ కు బాటలు వేసిన ప్రగతి ప్రధాతకు కేసిఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు సైదులు,ఈదుల మధుసూదన్,పోతరాజు వెంకన్న,ఈదుల సైదులు, పావురాల నాగేశ్వర్,గొట్టిపర్తి చంద్రమౌళి,బాదిని వీరయ్య, జానయ్య, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, శ్రీకాంత్, నవీన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!