*ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి సంతకం ఆ ఫైలుపైనే..*
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులంటూ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ తెలిపారు. ప్రజలు ప్రగతిభవన్ కు రావొచ్చంంటూ వెల్లడించారు. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రసంగం అనంతరం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీల అభయహస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం.. తొలి సంతకం అభయహస్తం ఫైలుపై.. ఆ తర్వాత రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా.. ఉద్యోగం కల్పించాలని రజిని అనే దివ్యాంగురాలు కొంతకాలం క్రితం గాంధీభవన్ లో కలిసి రేవంత్ ను కోరగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారు. ఆ మాట ప్రకారం.. రజినికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు.
*కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే..*
📌 మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
📌 రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
📌 గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
📌 గృహ నిర్మాణానికి రూ.5లక్షల సాయం
📌 విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్
📌 వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా
This post was created with our nice and easy submission form. Create your post!