ఐదుగురు ప్రయాణించగలిగే ద్విచక్ర వాహనాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు.
విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రిపుల్-ఈ, సీఎస్సీ, మెకానికల్ విభాగాల విద్యార్థులు దీపక్‌రెడ్డి, లలిత్‌కుమార్, నితిన్ చక్రవర్తి, జ్ఞానేశ్వర్‌రెడ్డి, వినోద్, భరద్వాజ, మురళీ మనోజ్, చంద్రశేఖర్ భారిక్ కలిసి ‘ఈ-బైక్’ తయారు చేశారు. ఆరుగురు కూర్చునేందుకు బైక్‌ను 4 మీటర్ల పొడవు చేశారు. బ్యాలెన్స్ సమస్య తలెత్తకుండా అడ్వాన్స్డ్ డైనమిక్స్ స్టిమ్యులేషన్‌తో బరువు రెండు చక్రాలపై సమానంగా పడేలా చూసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని 30 రోజుల్లోనే రూపొందించారు.
దీనిలోని బ్యాటరీలు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే వంద కి.మీ. వెళ్లొచ్చు. సౌరశక్తితోనూ ఛార్జింగ్ చేసుకోవచ్చు. పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో కుటుంబ సభ్యులంతా ఈ బైక్‌పై సులువుగా చక్కర్లు కొట్టొచ్చు. అధికారుల పరీక్షలు పూర్తయ్యాక ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!