పాడేరు అక్టోబరు 5: అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. చింతపల్లి,రంపచోడవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించారా లేదా పరిశీలించి చెల్లించకపోతే చెల్లించడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. జిల్లాలో 134 కేసులు ఉన్నాయని పూర్తి స్థాయిలో విచారణ జరిపి చార్జిషీట్ వేయాలన్నారు. పాఠశాలలు, గ్రామ పంచాయతీలలో సివిల్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సివిల్స్‌డేపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కేసుల పరిష్కారానికి కులదృవీకరణ పత్రాలు లేక పోవడం వలన ఇబ్బందులున్నాయని పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టిక తీసుకుని రావడంతో సానుకూలంగా స్పందించారు. ఐటిడి ఏ పిఓ లకు రాసి కులదృవీకరణ పత్రాలు పొందాలని సూచించారు. భూ సమస్యలు, వివాహ సమస్‌లుంటే కమిటీ దృష్టికి తీసుకుని రావాలని కమిటీ సభ్యులకు సూచించారు. బాధితులకు పింఛన్లు మంజూరు చేయవలసి ఉంటే మండల కమిటీలు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వానికి పంపించి మంజూరు చేయిస్తామన్నారు.
ఈ సమావేశంలో పాడేరు ఎ ఎస్ పి కె. ధీరజ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జి. జనార్ధన రావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండల రావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ టి. సుజాత, రంపచోడవం ఎటిడబ్ల్యూఓ రామ తులసి, ఎస్ డబ్ల్యూ ఓ డి. ఎల్. ఆనందరావు, కమిటీ సభ్యులు చెండా లోహితాస్, పలాసి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!