Chandrayaan-3:
శ్రీహరికోట, న్యూస్‌టుడే: చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు..
అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. ఇస్రో మాజీ అధిపతి ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ల్యాండర్, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్ ఓ అఖండ విజయమని అభివర్ణించారు..
This post was created with our nice and easy submission form. Create your post!