గురు న్యూస్ విశాఖపట్నం :175/175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు సాధ్యమే ఆత్మవిశ్వాసంతో అడుగేయాలంతే అని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.మంచి కార్యక్రమాలతో యుద్ధ ప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్ళాలి అని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి,పేరుతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై చర్చ జరపాలి అని అన్నారు.అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మనం గేర్ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు. అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు.ఇన్నిరోజులు మనం బాగా చేశాం కదా, వచ్చే ఆరు నెలలు సరిగా పనిచేయకపోయినా పర్వాలేదు అనే భావన సరికాదు. వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు పడాలి.ఇంతకముందు నేను చెప్పాను. 175 కి 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? వైనాట్ 175. ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, ఇది సాధ్యం. క్షేత్రస్ధాయిలో మనం అంత బలంగా ఉన్నాం కాబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీచేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి. అని అన్నారు. ఆయన మాట్లాడుతూ గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, మీరు ఇచ్చిన లేఖను ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చినప్పుడు వాళ్లలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే మందు చూపు, ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి అని అన్నారు జగన్. ఇంతకు ముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరునెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు.ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ, వారితో మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి. రాబోయే రోజుల్లో ఇంకా పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ప్రతి నియోజకర్గంలో విభేదాలు లేకుండా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. గ్రామ, మండల స్ధాయిలో ఉన్న నాయకులకు ఎలాంటి విభేదాలున్నా.. వాటిన్నింటినీ పరిష్కరించుకుని, వారిని సరిదిద్దుకుని అడుగులు వెయ్యాలని ఆయన సూచించారు.
This post was created with our nice and easy submission form. Create your post!