in ,

ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి

పాడేరు, సెప్టెంబర్ 26:-  అక్టోబర్ ఒకటి నుండి జరుగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల ద్వారా రోగుల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా మంగళవారం పాడేరు మండలం దిగువ మోదాపుట్టు లో గల గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాటశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించిన వైద్య శిభిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా వైద్య శిభిరంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ అక్కడ హాజరైన రోగులతో ముచ్చటించి వారి అనారోగ్యాలకు సoభంధించి డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలన, తద్వారా ఆరోగ్యం మెరుగు పరుచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వైద్య శిభిరానికి వైద్య నిపుణులను కేటాయించాలని, అవసరమైతే ఇతర ప్రాంతాలనుండి రప్పించటానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కంటి వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్, ఆర్తోపెడిసియన్, గుండె సంబంధిత వైద్య నిపుణులు ఉండాలని, అదేవిధంగా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.  వైద్య శిభిరానికి హాజరైన వారందరికీ హెచ్.బి, బిపి, షుగర్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిoచాలన్నారు.  ఇతర వ్యాధులకు సంభందించి వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం పోజిటివ్ వచ్చిన వారికి తెలియజేయటంతో పాటు క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ మందులు వాడే విధంగా ఆశ వర్కర్ కు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు.  వ్యాధి రకాన్ని బట్టి కేటగిరీ వారిగా హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు.  ప్రతి వైద్య శిభిరానికి ప్రత్యెక వైద్య నిపుణులను మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.బిపి తో భాద పడుతున్న ఒక రోగిని పరామర్శించి అతనికి రెండు నెలలకు సరిపడా మందులు ఇప్పించటంతో పాటు మందులు క్రమం తప్పకుండా వాడుతూ, ఉప్పు, కారం, మషాలా తగ్గించాలని, ధూమపానం, మద్యపానం మానివేయాలని తద్వారా ఆరోగ్యం పరిరక్షించుకోవాలని హితభోద చేసారు. అదే విదంగా కే. రోహిత్ అనే నాల్గు సంవత్సరాల వయసు గల మానసిక ఎదుగుదల సరిగా లేని, తరచూ ఫిట్స్ తో బాధ పడుతున్న బాబును ఎత్తుకుని పరిశీలించి అతని మానసిక ఎదుగుదలకు చికిత్స అందించాలని వైద్యులను కోరారు. వారి పేద స్థితికి చలించిన కలెక్టర్ ఆ అబ్బాయికి 61 శాతం శారీరక వికలా౦గం ఉన్నందున వికలాంగ పించన్ మంజూరుకు పరిశీలి౦ఛి చర్యలు తీసుకుంటానని  హామీ ఇచ్చారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఎన్ఆర్ఇజిఎస్ వేతన దారులకు పని కల్పించండి

జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన