ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నానని ఈ రెండేళ్లలో ప్రజలకు తనకున్న అవకాశం మేరకు సేవలు అందించగలిగానని భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకెళ్లే విషయంలో ముందు ఉంటానని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా రెండేళ్ల పూర్తి చేసుకొని మూడో ఏడాది అడుగుపెట్టిన శుభ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్తు ఉద్యోగులు చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. సుభద్ర చైర్ పర్సన్ గా రాకముందు వచ్చిన తర్వాత ఉన్న మార్పులను ఈ సందర్భంగా ఉద్యోగులు వివరించారు. సుభద్ర తో కలిసి పనిచేసే అదృష్టం తమకు లభించినందుకు ఆమెకు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా జరిగిన కారుణ్య నియామకాలు, ప్రమోషన్లపై ప్రశంసలు కురిపించారు. ఉద్యోగుల పట్ల చైర్ పర్సన్ చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఈ సందర్భంగా ఉద్యోగులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈ సమాజానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ఉండే పివిటిజీ కులానికి చెందిన తనకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి గొప్ప గౌరవాన్ని ఇచ్చారని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం జగనన్న కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు చైర్ పర్సన్ గా సేవ చేసే భాగ్యాన్ని దక్కించిన జగనన్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోనని పునరుద్ఘాటించారు. రాజకీయంగా తనకు అనుభవం లేకపోయినా అనేక పాలన విషయాలపై అధ్యయనం చేసి మరి ప్రజలకు తన శాయశక్తుల సేవలు అందించానని తెలిపారు. తనకు తెలియని ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుని మరీ దానిపై మరింతగా అధ్యయనం చేసి ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ప్రజలను భాగస్వామ్యం చేయడంలోనూ కీలక భూమిక పోషించే విధంగా ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంగా తనపై ప్రేమ ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు, శ్రేయోభిలాషులకు జడ్పిటిసిలకు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు , జిల్లా పరిషత్ ఉద్యోగులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!