in , , ,

ఏపీలో అరాచక పాలన: పురంధేశ్వరి

రాష్ట్రంలో అరాచక పాలన, కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖలో భాజపా సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ల సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు భాజపా వాస్తవాలు చెబితే.. దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నీ అబద్ధాలు చెప్పారు. వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ వాడేయడం తదితర ఎన్నో అంశాలను దాచేందుకు ప్రయత్నాలు చేశారు. నాణ్యతలేని మద్యం విక్రయాల ద్వారా ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడుల మాట లేదు. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరవయ్యే పరిస్థితి నెలకొందన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్

శీర్షాసనం వేసి టీడీపీ నాయకులు నిరశన