పాడేరు సెప్టెంబరు 21 : ఈనెల 22వ తేదీన( శుక్రవారం ) పెదబయలు మండల కేంద్రంలో నిర్వహించనున్న జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందనను రద్దు చేసామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా శుక్రవారం ఐటిడి ఏ లో స్పందనను రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ షెడ్యూలు తెగల కమిషన్ సభ్యులు అనంత నాయక్ పర్యటన ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మార్పును గమనించి అర్జీదారులు స్పందనకు రావద్దని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!