డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
గణేష్ నిమజ్జనానికి పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలోని ప్రతీఏటా ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న రాజోలు గోదావరి తీరం ఏటుగట్టు ప్రాంతాన్ని బుధవారం ఎస్పీ శ్రీధర్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అన్నీ శాఖల అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయ పరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట రాజోలు సీఐ గోవిందరాజు, రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, ఎసై జి పృద్వి ఉప సర్పంచ్ పామర్తి రమణ, రోటరీ క్లబ్ సభ్యులు నామన షణ్ముక్, అడబాల నాని తో పాటుగా పంచాయితీ సిబ్బంది వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
[zombify_post]