Janasena :
రాజమండ్రిలో 14వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్నర్యంలో ఆ పార్టీలో సమావేశమై రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పని చేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతో పాటు అధికార పార్టీని నిలువరించే లక్ష్యంతో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నుండి ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకునే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.