గురు న్యూస్, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు పై, మణిపూర్ ఉక్కు మహిళా, పౌర హక్కుల మహిళా నేత, ఇరోమ్ చాను షర్మిల తొలిసారి స్పందించారు. ఈ సందర్బంగా,ఆమె మాట్లాడుతు గొప్ప దర్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె అన్నారు. అటువంటి నాయకుడు ని అరెస్ట్ చెయ్యడం ప్రజాస్వామ్యం వ్యతిరేకం అని అన్నారు. అవినీతి సంబందించిన దర్యాప్తు పారదర్శకంగా జరిగితే ఈడి ఏ ఒక్క బీజేపీ నాయకుడి పై కేసులు ఎందుకు నమోదు చెయ్యలేదు, అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ తనకి వ్యతిరేకంగా ఉన్నవారిని అణాచడానికి మోడీ చేయిస్తున్న కుట్ర అని ఆమె తెలిపారు. తాను కూడా 16 నెలలు జైల్లో ఉన్నట్టు ఆమె తెలిపారు. తనలాగే చాలా మంది రాజకీయ నాయకులు జైల్లో ఉన్నట్టు ఆమె తెలిపారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కుట్ర లో భాగమే అని అయన అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని ఆమె ఖండించారు.
[zombify_post]