*చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనలు రోడ్ల *మీదకు దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం టెక్కలి, కోటబొ -మ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల టీడీపీ నాయకులు ఆందోళనలు చేశారు . ఉవ్వెత్తున ఎగ సిన కెరటాల్లా ఒక్కసారిగా రోడ్ల మీదకు దూసుకు వచ్చారు.. కోటబొమ్మాళిలో టీడీపీ కార్యాలయం నుంచి రైతుబజార్ వరకూ నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. మండల నాయకులతో సహా ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చిన ముఖ్య నాయ కులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొ న్నారు. అలాగే.. సంతబొమ్మాళిలో బస్ స్టాండ్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ చేశారు. టెక్కలిలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు,గ్రామాల నుంచి వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా వచ్చి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇంకా కొందరు ముఖ్య నాయకులను ఇల్లు కదలకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు హౌస్ అరెస్ట్లుచేశారు. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపిన వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి మూకుమ్మడిగా అరెస్టులు చేశారు. హౌస్ అరెస్ట్ అరెస్టయిన వారిలో టీడీపీ నాయకులు బగాది శేషు, హనుమంతు రామకృష్ణ, కోళ్ల లవకుమార్, కోళ్ల కామేష్, దల్లి ప్రసాద్ రెడ్డి, రాంప్రసాద్, ముడి దాన ఆనందరావు, మట్ట పురుషోత్తం.. తదితరులున్నారు.
[zombify_post]