*విద్యుత్ పొదుపు భవిష్యత్తుకు మలుపు…… ఈ ఈ సుధాకర్ కుమార్* ✍️జాతీయ *ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం*……
ఆదోని అర్బన్……. విద్యుత్ పొదుపు దేశ భవిష్యత్తుకు మలుపు అని విద్యుత్ శాఖ *ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ కుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల లో భాగంగా స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా *సుధాకర్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి డిసెంబర్ 20వ* తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే విద్యుత్ పొదుపు పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16వ తేదీన స్థానిక నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో వ్యాస రూప పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలోఏడి పురుషోత్తం, ఏఈలు నాగభూషణం, సంతోష్, శారద, చెన్నయ్య తదితర ఏఈలు సబ్ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!