రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
మృతి పిల్లలను పరామర్శిస్తున్న సిపిఐ,రైతు సంఘం నాయకులు
ఆదోని రూరల్; వరుస కరువు కాటకాలతో రైతులు పెట్టిన పెట్టుబడులకు దిగుబడులు రాని పక్షంలో సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లడం,అప్పుల భారమై ఏ కష్టం చేసిన తీర్చలేమని మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిహార అందించి రైతులు ఆదుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. మండలంలోని అలసంద గుత్తి గ్రామానికి చెందిన లడ్డా సోమేశ్ గురువారం తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు విదితమే.శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని మర్చురిలో ఉంచగా సిపిఐ, రైతు సంఘం,జనసేన పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పడం బూటుకపు చర్య తప్ప మరొకటి లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పాలన సాగిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.మృతి చెందిన సోమేష్ భార్య,ఇద్దరు పిల్లలను,కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. రైతులు అప్పులు ఉండడం సహజమే ఉన్న అప్పులపై సాధిస్తూ జీవనం గడపాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడమే అప్పులకు పరిష్కారమనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. మృతిచెందిన లడ్డు సోమేశ్ కుటుంబానికి ప్రభుత్వం రూ,,25 లక్షలు ఎక్స్రేసియా కలిపిస్తూ,బ్యాంకులలో తీసుకున్న రుణాలు రద్దు చేస్తూ,తోటి రైతులతో తీసుకున్న అప్పులను ప్రభుత్వమే చెల్లించి,తండ్రి లేని ఇద్దరు పిల్లల చదువు పై ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని కొడుకు విష్ణు 7వ తరగతి,కూతురు తులసి 5వ తరగతి చదువు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న అప్పుల భయంతో భార్య మునేశ్వరి చదువు మాన్పించి తెలంగాణ ప్రాంతానికి వలస వెళ్లారంటే వ్యవసాయ రంగం ఎంత భయంకరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తహేర్ వలి, మండల నాయకుడు పులి రాజు మరికొందరి నాయకులతో కలిసి భౌతికయాన్ని సందర్శించి మృతుడి భార్య,పిల్లలను కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వ పాలన వైఫల్యమే కారణమన్నారు. మృతుడికి ఉన్న 1:50 సెంట్లతో పాటు పది ఎకరాలు కౌలుకు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యే అన్నం పెట్టే అన్నదాత అశువులు భాష అంటే అధికారులు పాలకులు కాదా అంటూ నిలదీశారు. మృతుడి భార్య పేరు మీద ఐదు ఎకరాలకు కౌలు రైతు కార్డు ఇచ్చారు తప్ప మిగతా ఐదు ఎకరాలకు ఎందుకు కౌలు రైతు కార్డు ఇవ్వలేదని ప్రశ్నించారు. కనీసం ఐదు ఎకరాలు కౌలు రైతు కార్డుకు బ్యాంకులోను సదుపాయం కల్పించి ఉండి ఉంటే ఎవరైతే మృతి చెందేవాడా అంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుల బాధ బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు పరిహారం వచ్చే విధంగా,అనాదులుగా మిగిలిపోయిన ఇద్దరు పిల్లలు చదువుకు సంబంధించిన విషయం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెల్లి జనసేన పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదని తమ కుటుంబానికి అండగా నిలుస్తామని ధైర్యంగా ఉండాలని చెప్పారు.
This post was created with our nice and easy submission form. Create your post!