ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదన శర్మ
నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సమస్యలను ముఖ్యమంత్రి జగనన్నకు వివరిస్తూ ఈబిసి నేస్తం ద్వారా చాలా మంది బ్రాహ్మణ మహిళలకు లబ్ధి చేకూరుతోంది అందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలిపడమే కాకుండా పేద బ్రాహ్మణ యువతులకు వివాహములు జరిపించడం తల్లిదండ్రులకు భారంగా మారిందని అందువల్ల “వేదమాత కల్యాణ వైభవం” అనే పథకము ప్రవేశపెట్టి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేస్తే బాగుంటుందని తెలపడమే కాకుండా బ్రాహ్మణులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు, కర్మలు,చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించడానికి “వేదబ్రాహ్మణ అంతిమయాత్ర ఆసరా ” అనే పేరుతో యాభైవేల రూపాయలు అందించాలని, అలాగే క్రెడిట్ సొసైటీ ద్వారా చేతివృత్తులకు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రాహ్మణ మహిళలకు లక్షరూపాయలు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని, కర్నూలు పట్టణములో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు వారు వివాహాలు, కార్తీక బోజనాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానాకి చాలా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి కర్నూలు పట్టణములో బ్రాహ్మణ భవణము నిర్మించాలని మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది.ముఖ్యమంత్రి జగనన్న సానుకూలంగా స్పందించి ఆయన వ్యక్తిగత కార్యదర్శి చెప్పి మధుసూదన శర్మ ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పడం జరిగింది.నేను వివరించినంతసేపు శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.నాకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించిన మా నాయకుడు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి, ఆదోని వైఎస్సార్ పార్టీ యువనేత శ్రీ వై జయమనోజ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదములు తెలియచేసారు.
This post was created with our nice and easy submission form. Create your post!