*Israel – India: ఇజ్రాయెల్ – హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లోని టెక్ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ లేదా యూరప్‌కు తరలించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు ఏటా ఐటీ రంగం ద్వారా 14 శాతం ఆదాయం లభిస్తోంది. ఆ దేశ ఆర్థివ్యవస్థలో ఇది అత్యంత కీలకం. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, టీసీఎస్ సహా 500కు పైగా అంతర్జాతీయ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మొత్తంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్ట్‌లను ఇజ్రాయెల్‌లోని ఐటీ సంస్థలు చేపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో కంపెనీ నిర్వహణ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్ట్‌లను భారత్ సహా యూరప్‌లోని దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. మరోవైపు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు ఇజ్రాయెలీలు సైన్యంలో విధులు నిర్వహించేందుకు వెళ్లడంతో మానవ వనరుల కొరత వెంటాడుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లను ఇతర దేశాల్లో ఉన్న కంపెనీ ఉద్యోగులతో పూర్తి చేయాలని భావిస్తున్నాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం కంపెనీలు భారత్‌వైపు మొగ్గుచూపుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి. అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు భారత్‌లో అందుబాటులోకి ఉన్నాయని అధిక శాతం కంపెనీలు భావిస్తుండటం ఇందు ప్రధాన కారణం.
This post was created with our nice and easy submission form. Create your post!