*అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ స్పూర్తితో రాయలసీమ హక్కులకోసం పోరాడుదాం. ~ రాయలసీమ ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు
అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ స్పూర్తితో రాయలసీమ హక్కులకోసం పోరాడాలని నేడు ఆదోని పట్టణంలో RCC ఆధ్వర్యంలో AADA,PDSO, AIFTU భాగస్వామ్యం తో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం నుండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా AADA కన్వీనర్ ఆదినారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1 అంటేనే రాయలసీమ హక్కులకు గుర్తుగా ఉందని దానిని ఈ రాయలసీమ సమాజం ఎన్నటికీ మర్చిపోవద్దని అన్నారు. నేడు ఉన్న ప్రభుత్వం నవంబర్ 1 జరపుతుందని అది సరైంది కాదని అన్నారు.ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూల్ నే నేడు ఆంద్రప్రదేశ్ కి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. PDSO జిల్లా కన్వీనర్ తిరుమలేష్ మాట్లాడుతూ అన్నిరంగాలలో వెనుకబడిన రాయలసీమ కు ప్రభుత్వాలు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ ను రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇక్కడ పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. RCC పొలిటికల్ ఆర్గనైజర్ రాజన్న మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడి 1953 అక్టోబర్ 1 ఆంధ్రరాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడిందని, 1956 నవంబర్ 1 న బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగాతెలంగాణ కలవడంతో ఆంద్రప్రదేశ్ ఏర్పడిందని అపుడు రాజధాని హైదరాబాద్ ఉందని తిరిగి 2014 జూన్ 2 న తెలంగాణ విడిపోవడంతో పూర్వ ఆంధ్ర రాష్ట్రమే ఉందని అప్పుడు న్యాయంగా కర్నూలే నేడు రాజధానిగా ఉండాలని కోరారు. కానీ ఇప్పుడు ఈ దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రమేనని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం శ్రీబాగ్ ఒప్పందాన్ని చేసుకున్న దానిని ఏ మాత్రం గౌరవించని పాలకులు నేడు ఈ ప్రాంత భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి సైతం వెనుకాడటం లేదని అన్నారు. అందుకే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవమైన అక్టోబర్ 1 స్పూర్తితో రాయలసీమ హక్కులకోసం పోరాడుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో AIFTU జిల్లా కార్యదర్శి గంగన్న, ఈరన్న, RCC నాయకులు శాంతరాజు, నాగేష్, ఉరుకుంద, రాజు, నాగరాజు, బసవరాజు, PDSO నాయకులు వీరేశ్ MRPS నాయకులు రామంజి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!