భారీ శబ్దాలు చేసేలా సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 59 సైలెన్సర్లు ధ్వంసం
నంద్యాల టౌన్ డిఎస్పి C.మహేశ్వర్ రెడ్డి
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS ఆదేశాలమేరకు మరియు నంద్యాల డిఎస్‌పి C. మహేశ్వర రెడ్డి పర్యవేక్షణలో నంద్యాల ట్రాఫిక్ సి.ఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే కొన్ని బుల్లెట్ వాహనాలను అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లుతోపాటు సీజ్ చేశారు. సీజ్ చేసిన 59 సైలెన్సర్లను నేడు నంద్యాల టౌన్ డి.ఎస్.పి C. మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల ట్రాఫిక్ పోలీసులు నంద్యాల గవర్నమెంట్ కళాశాల మైదానంలో రోడ్డు రోలర్ తో వాటిని ధ్వంసం చేశారు. ఎక్కువ శబ్దం చేయు బుల్లెట్ వాహనాల వలన వయసు పై బడినవారు, హార్ట్ పేషంట్స్,చాలా ఇబ్బందులకు గురియావుచున్నారు. కావున ఎక్కువ శబ్దము చేయు సైలెన్సర్లు ఎవరైనా తమ బుల్లెట్ లకు గాని మరి ఏ ఇతర వాహనాలకు గానీ ఏర్పాటు చేసుకున్నట్లైయతే స్వచ్ఛందముగా మార్చుకొని తక్కువ శబ్దము వచ్చే సైలెన్సర్లును తమ వాహనాలకు ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేల పోలీసుల తనిఖీలో ఎక్కువ శబ్దము చేయు సైలెన్సర్లను పట్టుకున్నయెడల MV ACT మేరకు భారీ జరిమానా విదించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వాడే వాహనాల సైలెన్సర్లపై నిఘా వేసి కౌన్సిలింగ్ చేసి శబ్ద కాలుష్య వలన కలుగు దుష్పరిణామాలను వివరించి పోలీసు వారికి సహకరించాలని కోరడమైనది.
This post was created with our nice and easy submission form. Create your post!