డా బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా కలెక్టర్
కాట్రేనికోన: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమం లో అందిన అర్జీలను సత్వరమే పరిష్కారించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారు లను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాల యంలో మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టరు, హిమాన్షు శుక్లా రెవిన్యూ డివిజనల్ అధికారి వసంతరాయుడితో కలిసి మండల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి, పరిష్కారించవలసింది గా ఆయా శాఖల అధికారు లను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర సమస్యలకు సంబంధించి సుమారుగా 51 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లా డుతూ ప్రజా ఫిర్యాదుల వేదిక స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపేలా కృషి చేయాలన్నారు. అర్జీదారుని సంతృప్టే ధ్యేయంగా పరిష్కార సరళ్లి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. లేని పక్షంలో దరఖాస్తు మరల రీ ఓపెన్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఒకసారి ఒక అంశంపై అందిన అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు ప్రతి అర్జీని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో విచారించి ఫోటోలుతో సహా యాప్లు అప్లోడ్ చేస్తూ నిర్దేశిత గడువులోపు పరిష్క రించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. తదుపరి జిల్లా కలెక్టర్ స్థానిక మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు ప్రతి ఒక్కరు యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని ఆరోగ్య వoతమైన జీవనాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షని ఆ దిశగా ఈ కార్యక్ర మాలను వినియోగించుకోవాలని జగనన్న ఆరోగ్య సురక్ష ప్రమాణ సంబంధించి ఏఎన్ఎం యాప్ నందు సర్వే వివరాలను పొందు పరిచే విధానాలను ఆయన నిశితంగా పరిశీలించారు. తదుపరి జిల్లా కలెక్టర్ మండల పరిధిలోని చె లకాయి చెరువు సమీపంలో ఈ క్రాప్ నమోదు ప్రక్రియను యాదృచ్ఛికంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సిపిఓ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి ఎస్ మధుసూదన్ డి ఆర్ డి ఏ. పి డి ,వి. శివశంకర్ ప్రసాద్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి జీవి సత్యవాణి డిపిఓ వి కృష్ణకుమారి, డీఈవో ఎం కమల కుమారి, వికాస జిల్లా మేనేజ ర్ గోళ్ల రమేష్ డిఎంహెచ్వో ఎం. దు ర్గారావు దొర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కె ప్రభాకర రావు,వివిధ శాఖల జిల్లా, తాసిల్దార్ వి.వి సత్య నారాయణ , ఎంపీడీవో వెంకటా చలం డివిజన్ మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొ న్నారు
This post was created with our nice and easy submission form. Create your post!