in ,

అల్లూరి జిల్లా విద్యార్థులు అంతే…..

  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం 1, 2, 4, 7 స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి.అల్లూరి జిల్లాలో చదువుల గురించి చర్చ సందర్భంగా ‘గిరిజన విద్యార్ధులు అంతే’ అంటూ అక్కడ డీఈవో కార్యాలయ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రతోపాటు ఏజెన్సీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చివరకు గిరిజన విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సదరు ఉద్యోగి వెనక్కి తీసుకోవడంతోపాటు సభకు క్షమాపణలు చెప్పారు.అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యా శాఖ కార్యాలయ పర్యవేక్షకుడు చక్రధర్‌ బదులిస్తూ ‘చదువుల విషయంలో గిరిజన విద్యార్థులు అంతే…’ అని వ్యాఖ్యానించడంతో చైర్‌పర్సన్‌ సుభద్రతోపాటు ఏజెన్సీకి చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘చైర్‌పర్సన్‌ సీటులో ఉన్నది గిరిజన బిడ్డ…సభలో పలువురు గిరిజన బిడ్డలు ఉన్నారు. అటువంటి మాటలు మాట్లాడడం తప్పు…’ అంటూ సుభద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ వెంకటలక్ష్మి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతోవిద్యా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ చక్రధర్‌…తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటానని, ఇంకా సభకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ పలువురు టీచర్లు రాజకీయాలు చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారన్నారు. విద్యార్థులకు చదువు చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పేర్కొంటూ ఆ దిశగా విద్యా శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

వర్క్ బుక్ దిద్దని ఫలితం…..

గుక్కెడు నీళ్లు కోసం…..