తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో మంగళవారం విఘ్నేశ్వర హోమంను నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను కోర్టులు కొట్టి వేయాలని, ఆయన వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వేద పండితులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గణేశుడి పూజలు చేసి ప్రార్థించారు.