Nara Lokesh: ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారంటూ హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకొచ్చారు. హైదరాబాద్ లోని మదాపూర్, హైటెక్ సిటీ వంటి తదితర ప్రాంతాల్లో పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి చద్రబాుబ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేశారు. అయామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు చేతబూమి, పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ చద్రబాబు అరెస్టును ఖండించారు.