మన భారతదేశానికి పేదరికం నుండి బయట పడేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్.
చాచా నెహ్రూ మన దేశానికి పునాదులు వేస్తే ఆ పునాదులపై నవభారతాన్ని నిర్మించిన మహనీయుడు మన్మోహన్ సింగ్. దేశాన్ని నడపలేని స్థితిలో వేల టన్నుల బంగారాన్ని విదేశాలకు కుదువ పెట్టిన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా సారథ్యం చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్.
మనదేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూనే మన దేశం కంపెనీలకు నష్టం కలగకుండా తెలివిగా వ్యవహరించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్.
లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్. భారతదేశంలో పేదలంటే గుడిసెలు, చిరిగిన దుస్తులు, ఆకలి కేకలు అనే పరిస్థితి నుండి దేశంలో పేదరికమే లేకుండా రూపుమాపిన పేద బడుగు బలహీన వర్గాల బాంధవుడు గొప్ప ఆర్థిక వేత్త భరతమాత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్. వందలాదిమంది విలేకరులకు సైతం ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగల మేధావి మన్మోహన్ సింగ్. చంద్రయాన్ వంటి గొప్ప ప్రాజెక్టును ప్రారంభించి ప్రపంచంలో భారతదేశం తలెత్తుకునేలా చేసిన గొప్ప దార్శనికుడు ప్రధాని మన్మోహన్ సింగ్.
పేదరికము ఆకలి బాధలే హింసకు ప్రధాన కారణమని గ్రహించి పేదరికం రూపుమాపి దేశాన్ని శాంతియుత దేశంగా మార్చిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం చేతులు కట్టుకునే శ్రద్ధగా వినేది మన్మోహన్ సింగ్ గారి స్పీచ్ మాత్రమే.
జీతాలు చెల్లించలేని దుస్థితి నుంచి ప్రపంచంలో నాలుగవ గొప్ప ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలబెట్టిన గొప్ప ఆర్థికవేత్త ప్రధానమంత్రి మాన్మోహన్ సింగ్.
నేడు భారతదేశము ఏ దేశానికైనా ఆర్థికంగా సైనిక పరంగా సవాలు విసరగలదంటే దానికి ఒకే ఒక్క కారణం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.
నవీన భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు మన్మోహన్ సింగ్.
భారతదేశంలో పేదరికం రూపుమాపి భారతదేశం కీర్తి పథాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడించిన గొప్ప ఆర్థిక వేత్త మాజీ ఆర్థిక మంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి శ్రద్ధాంజలి ఘటిస్తుంది.
అమర్ రహే అమర్ రహే మన్మోహన్ సింగ్ అమర్ రహే.
– ఎ. నూర్ అహ్మద్,
– మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS రాష్ట్ర కార్యదర్శి.
This post was created with our nice and easy submission form. Create your post!