కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై పోలీసుల ఉక్కు పాదం…
కర్నూలు జిల్లా ఆదోని మండలములో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు పోలీసులు. ఈ డ్రైవ్ లో వేరువేరు ప్రాంతాల నుంచి 6 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14 మద్యం బాక్సులు ఒక ఆటో ఒక స్కూటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమైండ్ కి తరలించినట్లు ట్రైనింగ్ డిఎస్పి ధీరజ్ విలేకరులకు సమాచారం ఇచ్చారు.
వివరాల్లోకెళ్తే…
సంతేకుడ్లూరు గ్రామ బస్టాప్ వద్ద ఆస్పరి మండలము, కారుమంచి గ్రామానికి చెందిన బోయ ఆరేకంటి భీమలింగ, చెన్నప్ప లు కర్ణాటక రాష్ట్రం నాగరహళ్ గ్రామములోని వైన్ షాప్ లో 06 లిక్కర్ బాక్సుల ను కొనుగోలు చేసి వాటిని AP-39-UK-6408 ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు.
మాధవరం రోడ్డులోని కోసిగి క్రాస్ వద్ద కోసిగి గ్రామానికి చెందిన గోపాల్, లక్ష్మీకాంత్ లు 06 లిక్కర్ బాక్సుల AP-21-S-0246 (TVS Star Sport)మోటార్ సైకిల్ పై పెట్టుకొని పెద్దతుంబలం గ్రామానికి చెందిన రాజేష్ కు అమ్మాలని వెళ్తుండగా పట్టుకొని సీజ్ చేశారు.
పెద్దతుంబలం గ్రామములోని బోయ గోవిందు అనె వ్యక్తి తన ఇంటి మద్యం అముతూ పట్టబడ్డాడు అతని అరెస్టు చేసి 02 లిక్కర్ బాక్సులను సీజ్ చేశారు.
కర్నూలు జిల్లా ఎస్పీ కాంత్ IPS, I/C Addl .SP, SEB జి.నాగరాజు ఆదేశాల మేరకు ఆదోని డి.ఎస్.పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో అక్రమ కర్ణాటక మద్యం అదుపు చేయడానికి ఈ దాడులు నిర్వహించినట్లు ఆదోని రూరల్ సర్కిల్ ఇంచార్జ్ ట్రైనీ DSP ధీరజ్ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ G. నిరంజన్ రెడ్డి మరియు ఇస్వీ పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ K.శ్రీనివాసులు, పెద్దతుంబలం పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ చిన్న పీరయ్య మరియు వారి సిబ్బంది కలసి పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!