ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి.*
*ఆదోని కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి…(JAAP)జాప్*
* జాప్ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్*
ఆదోని పట్టణంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( JAAP) జాప్ జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ ,మరియు జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ , మరియు జాప్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదోని జాప్ జర్నలిస్ట్ నాయకులు జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం, సమస్యలను వివరించారు. అలాగే ఆదోని కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని మరియు ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు జాప్ జర్నలిస్ట్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జాప్ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్(ఆదోని మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు) మాట్లాడుతూ…………ప్రభుత్వానికి ప్రజలకు వారదిగా ఉన్న జర్నలిస్టులకు అక్రిడేషన్ నిబంధన లేకుండా ఇంటి స్థలాలను ఇవ్వాలని అందుకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇంటి స్థలాలు కేటాయించాలని వారు కోరారు. అలాగే గతంలో ఆదోనిలో ప్రెస్ క్లబ్ ఉండటం జరిగిందని అందులో ఆదోని ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నేను పనిచేసిన రోజులో గ్రామాలనుంచి వచ్చే జర్నలిస్టులకు కూర్చోడానికి వీలుగా , ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో జర్నలిస్టులకు కావలసిన ఇన్సూరెన్స్,సహాయ నిధి వంటి జర్నలిస్ట్ అభివృద్ధి పనులు చేసుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. అందుకు స్పందించిన ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ………… ఆదోని పట్టణ కేంద్రంలో తప్పకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రెస్ క్లబ్ మరియు ఇంటి స్థలాలకు అనువైన ప్రదేశం చూసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్, జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్, జాప్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల వెంకటేష్ , జాప్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్ ,మరియు జాప్ జర్నలిస్టు నాయకులు…చంద్ర శేఖర్, రంగన్న, గౌస్, రామ్ గోపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్ కుమార్, ఈరన్న, శ్రీకాంత్, రాజు, శాంత మూర్తి, రమేష్ , రాజశేఖర్, అల్లప్ప, పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!