డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో తూఫాన్ ప్రభావం వలన విపరీతమైన వానలు పడడం తో డ్రైన్ లు పోని పొరలి నివసిత గృహాల దగ్గర నిల్వ ఉండిపోవడం తో తీవ్రమైన కుళ్ళిన కంపుతో విపరీతమైన దుర్గంధం తో వాటివలన దోమలు పెరిగి అవి కట్టడంతో రోగాల బారిన పడుతున్న కొత్తపేట పరిసర ప్రజలు.దానికి తోడు డంపింగ్ యార్డ్ లేక ఒకవేళ ఉన్న దానిని ఉపయోగించక తెలియక ప్రధాన కూడలిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త నిల్వ ఉంచడం మరి ముఖ్యంగా కౌశిక మార్గం మొత్తం చెత్తతో నిండి తడిచి దుర్గంధం చెందుతూ అదే మార్గం లో అనేక మంది ప్రజానీకం రాకపోకలు సాగించడం బాలికల పాఠశాల, డిగ్రీ పాఠశాల,గ్రౌండ్,వసతి గృహాలు ఉండడంతో ప్రజలు ఈ దుర్గంధం ఎప్పుడు విముక్తి చెందుతుందో అని ఎదురు చూపులు చూస్తున్నారు. ఇది పాలకుల నిర్లక్షమా లేక అధికారుల నీర్లక్షమా అని ప్రశ్నార్థకంలో ఉన్నారు గ్రామ ప్రజలు.
కంపు కొడుతున్న కొత్తపేట అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు అనారోగ్యం డివిజన్ కేంద్రమైన కొత్తపేట గ్రామం జల వాయు కాలుష్యంతో కంపు కొడుతుంది దీనికి తోడు స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం తో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ప్రజాపతినిధులు గ్రామంలో పర్యటన చేస్తున్నారంటే బస్తాలు బస్తాలు ముగ్గు తెచ్చి చల్లే అధికారులు తుఫాన్ వెళ్లి రెండు రోజులు గడుస్తున్న గ్రామంలో కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామంలో చిన్న పెద్ద డ్రైన్లు పొంగిపొల్లి దుర్వాసన వస్తున్న తక్షణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు కొత్తపేట రెవెన్యూ డివిజన్ కేంద్రం కావడంతో వివిధ గ్రామాల నుండి పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ కొంపు భరించలేక వాయిదా వేసుకుంటున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు ఒక పక్కన దుర్గంధం విరజల్లుతుంటే మరో పక్కన దోమలు తాండవం చేస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండవలసిన పంచాయతీ అధికారులు గ్రామంలో నివాసం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి దాపరించిందని గ్రామస్తులు తెలుపుతున్నారు పంచాయితీ అధికారులు చేయవలసిన పనులు చేయకపోవడంతో ఇటీవల కాలంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాసరావు తన సొంత నిధులతో డ్రైన్లు బాగు చేసిన సంగతి ఈ ప్రాంతంలో చర్చనీయమైనది.ఇప్పటికైనా పంచాయతీ అధికారులు గ్రామంలో పారిశుద్ధ్యన్ని పూర్తిగా తొలగించి మురుకు నీరు పోయే విధంగా డ్రైన్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు
This post was created with our nice and easy submission form. Create your post!