బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి.రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ….
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కేంద్రాలలో బ్రాహ్మణ భవణాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పేరి.కామేశ్వరరావు గారికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారికి,రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు.నిన్నటిరోజున విజయవాడ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ గారి కార్యాలయంలో ఇద్ధరి నాయకులతో సమావేశమై రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను ఇరువురి దృష్టికి తీసుకెళ్లి చర్చించిన అనంతరం రాష్ట్రములోని అన్ని జిల్లా కేంద్రాల్లో బ్రాహ్మణులు శుభకార్యాలు, సభలు సమావేశాలు నిర్వహించుకోవడానాకి సొంత భవనాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాగే చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లో బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకోవడానికి సరైన వసతులు లేకపోవడంతో వేరే క్షేత్రాలకు వెళ్ళి అపరకర్మలు చేసుకుంటున్నారని పెద్ధల దృష్టికి మధుసూదనశర్మ తీసుకెళ్ళడం జరిగింది, అలాగే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దాదాపుగా 2వేల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయని అపరకర్మలు చేసుకోవడానికి చిన్నపాటి స్థలము, నీటి వసతి లేదని వెంటనే ఆదోని బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూడాలని మధుసూదనశర్మ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్, దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులకు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ పెద్ధలు కామేశ్వర రావు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పర్యటించి బ్రాహ్మణులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు మధుసూదనశర్మ తెలిపారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి నిట్టల శైలజ గారు,రాష్ట్ర బ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షుడు శీతారామ్ గారు, సత్యనారాయణ శర్మగారు మొదలైన వారు పాల్గొన్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!