TJS Chief: కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై కోదండరాం క్లారిటీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్‌తో (Congress) కలిసి పనిచేసేందుకు టీజేఎస్ అధినేత కోదండరాం(TJS Chief Kodandaram) ఓకే చెప్పేశారు..
సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో (TPCC Chief Revanth Reddy) భేటీ అనంతరం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి జన సమితి దూరంగా ఉండనుంది. కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి జన సమితి సిద్ధమైంది.
రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని టీజేఎస్ ఛీఫ్ కోదండరాం వెల్లడించారు. ప్రజపరిపాలన కోసం తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నామన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని.. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. తమ ఉమ్మడి కార్యక్రమం సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. తమ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. తమ నిర్ణయానికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలని కోరుతున్నట్లు కోదండరాం పేర్కొన్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!