ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాదు సామాజిక స్పృహ లోనూ ముందుండే సంఘం – యు టి ఎఫ్
ఆదోని యం ఆర్ సి నందు అకౌంటెంట్ గా పనిచేస్తున్న రమణ అకాలమరణం సందర్భంగా UTF ఆదోని డివిజన్ ఆధ్వర్యాన ఉపాధ్యాయుల నుండి సేకరించిన దాదాపు రూ” 73,000 వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా UTF జిల్లా కార్యదర్శి టి గాదిలింగప్ప మాట్లాడుతూ ఆర్థిక సహాయం చేయాలన్న UTF ఇచ్చిన ఒక పిలుపుకు స్పందించిన ఉపాధ్యాయులు అందించిన సహాయం రూ” 73,000 సేకరించడం ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాదు సామాజిక (సహాయం) స్పృహలోనూ ముందుండే సంఘం యు టి ఎఫ్ అని తెలియజేశారు.
ఆదోని మండల అధ్యక్షులు వై రామాంజనేయులు జిల్లా ఆడిట్ సభ్యులు మల్లికార్జున మాట్లాడుతూ సమగ్రశిక్షలో పనిచేస్తూ అకాలమరణం చెందిన రమణ కుటుంబానికి రావలసిన రూ” 2,00,000 వెంటనే మంజూరు చేసి మానవతా దృక్పథంతో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి బరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
యం ఆర్ సి నందు అకౌంటెంట్ గా పనిచేస్తున్న రమణ అకాలమరణం గావించడం జరిగింది ఈ అనుకోని సంఘటన వలన వారి కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించాలని యు టి ఎఫ్ ఆదోని డివిజన్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఉపాధ్యాయులు దాదాపుగా రూ” 73,000 ఇవ్వడం జరిగింది సహకరించిన ఉపాధ్యాయులు అందరికీ UTF సీనియర్ నాయకులు పాపయ్య,కృష్ణ మూర్తి గారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ సభ్యులు మల్లికార్జున,సీనియర్ నాయకులు సునీల్ రాజ్ కుమార్, నరసయ్య గౌడు,బసప్ప,రంగన్న, జంబులింగయ్య,బాలాజీ రావ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!