బాల్య వివాహాల నివారణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు.
విజయనగరం ఉడాకాలనీ, : బాల్య వివాహాల నివారణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడారు. పూర్తిగా | అరికట్టేందుకు సమర్ధవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఒక్కోసారి తల్లి ప్రాణాలకు ముప వాటిల్లుతోందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు.పటిష్ట విస్తూ అవసరమని నిబందనలు వాటిల్లుతోందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో పటిష్ఠ నిఘా అవసరమని, నిబంధనలు అతిక్రమించి ముందుకెళితే నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఖాళీగా ఇళ్లవద్ద ఉండేవారికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పనపై దృష్టిసారించాలని కోరారు. ఇకనుంచి బాల్య వివాహం చేస్తే.. తల్లిదండ్రులతో పాటు పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, కల్యాణ మండపం నిర్వాహకులు, సంబంధిత వ్యక్తులందరిపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. ఈనెల 16న అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఉందని, పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి, డీసీపీవో ఎ.స్యతనారాయణ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!